General Knowledge-2018
1. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్‌శర్మ(39) భారత కుబేరుల్లో పిన్న వయస్కుడిగా, ఆల్కెమ్ లేబొరేటరీస్ గౌరవ ఛైర్మన్ సంప్రదసింగ్ (92) అత్యంత పెద్ద వయస్సు వ్యక్తిగా నిలిచారు
2. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(MSME) అంతర్జాతీయ సదస్సు 2018 మార్చి 6న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రారంభమైంది
3. 2022 కల్లా సంపన్న భారతీయుల జనాభా 71 శాతం పెరగవచ్చని నైట్ ఫ్రాంక్ వెలువరచిన వెల్త్ రిపోర్ట్ 2018 వెల్లడించింది
4. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ITBP) తొలి మహిళా అధికారిగా బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన ప్రకృతి(25) ఎంపికయ్యారు
4. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు దళం(ITBP) తొలి మహిళా అధికారిగా బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన ప్రకృతి(25) ఎంపికయ్యారు
5. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం, కరువు సాయం (డీఏ మరియు డీఆర్) 2 శాతం పెంచుతూ ప్రధాని మోడి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు
6. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం గురించి వివరిస్తూ లేఖ వేలంలో రూ.65 లక్షలు పలికింది
7. బాలీవుడ్ సీనియర్ నటి షమ్మీ(89) 2018 మార్చి 6న మృతి చెందారు
No comments:
Post a Comment