తెలంగాణలో 521 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల
తెలంగాణ రాష్ట్ర, ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డెరైక్టరేట్... 521 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 7 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విద్యార్హత: పోస్టులనుబట్టి ఎంబీబీఎస్/ బీడీఎస్.
వయసు: 2017, జూలై 1 నాటికి 18-44 ఏళ్ల లోపు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: మొత్తం 100 మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. 75 మార్కులు అర్హత పరీక్షలో సాధించిన అగ్రిగేట్ మార్కులకు, మిగతా మార్కులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వారికి, వారి సర్వీస్, పని చేస్తోన్న ప్రాంతం ఆధారంగా వెయిటేజీ ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు: డిసెంబర్ 20 నుంచి జనవరి 18 వరకు.
No comments:
Post a Comment